షెడ్యూల్ కులాల తెగలపై జరిగే దాడులకు సంబంధించిన నమోదైన కేసులను వేగవంతం చేయాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగావన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులకు సంబంధించిన నమోదైన కేసులపై వేగవంతంగా విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా. స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాదితులకై సత్వర న్యాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో మూడ నమ్మకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళా బృందాలచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఎస్సీ,ఎస్టీ లకు సంబంధించిన పీడన నిరోధక చట్టం పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాధితులకు చట్ట ప్రకారం పరిహారం నిధుల కేటాయింపుల మేరకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కోర్టు స్టే కారణంగా కొన్ని కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. మండల, సబ్ డివిజనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో మూడ నమ్మకాలపై పోలీసు కళాజాత బృందాలచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ వీణ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, డీఎస్పీ లు, ఎన్జీఓ లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


