దోమకొండ మండల కోర్స్ డైరెక్టర్ నీ సన్మానించిన ఉపాధ్యాయులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బాలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో దోమకొండ మండల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను మండల ఉపాధ్యాయులు శనివారం సన్మానించారు. గత ఐదు రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపు సమావేశం అనంతరం దోమకొండ మండల ఉపాధ్యాయ శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను ఉపాధ్యాయులు పాల్గొని శాలువాతో సన్మానించారు. శిక్షణ కార్యక్రమంలో ఆయన సలహాలు సూచనలు ఉపాధ్యాయులకు మెలకువలతో పాటు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించే విధంగా అర్థమయ్యే తరహాలో శిక్షణ పొందపరచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



