ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖ హనుమాన్ దేవస్థానం ఆలయ కమిటీ మేరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకట రమణారెడ్డి శనివారం పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కామారెడ్డి పట్టణవాసులు పాల్గొన్నారు.



