తలసేమియా చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన రికార్డు కామారెడ్డి జిల్లాకే దక్కింది.
రెండు సంవత్సరాల కాలవ్యవధిలోనే 3 వేల యూనిట్ల రక్తం సేకరణ.
రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 26 ( అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ వారి సహకారంతో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,లైన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షులు చిలువేరు మారుతి,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దేశంలోనే తల సేమియా వ్యాధి చిన్నారుల కోసం రెండు సంవత్సరాల వ్యవధిలోనే అత్యధికంగా 3 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత కామారెడ్డి రక్తదాతల సమూహనికే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కి దక్కిందని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని,వారికి జీవితాంతం 15 రోజులకు ఒకసారి ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని,వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఆ సమాజంలోని ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.నిస్వార్ధ సేవకులు రక్తదాతలని రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని అన్నారు.రక్తదాన శిబిరానికి సహకరించిన చిలువేరి మారుతికి తలసేమియా సికిల్ సెల్ సొసైటీ పురస్కారాన్ని అందజేయడం జరిగింది.73 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్కే విద్యాసంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి,కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు పర్శ వెంకటరమణ,ఎర్రం చంద్రశేఖర్,గంప ప్రసాద్,వేదప్రకాష్,ఉప్పల హరిధర్, కుంభాల లక్ష్మణ్ యాదవ్,నవీన్ లు పాల్గొనడం జరిగింది.