ఎమ్మెల్యే సహకారంతో భూలక్ష్మి మహాలక్ష్మి ఆలయం అభివృద్ధి

ఎమ్మెల్యే సహకారంతో భూలక్ష్మి మహాలక్ష్మి ఆలయం అభివృద్ధి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ. మండల కేంద్రంలోని సమాధి గడ్డ కాలనీలో భూ లక్ష్మి, మహాలక్ష్మి ఆలయం రేకుల షెడ్డు నిర్మాణం పనులను బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నాయకులు, వివిధ కుల సంఘం సభ్యులు బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సమాధి గడ్డ కాలనీలో భూలక్ష్మి, మహాలక్ష్మి ఆలయం రేకుల షెడ్డు నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు అందజేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఆలయం అభివృద్ధి కోసం నిధులు అందజేయడంతో పనులు ప్రారంభించామని తెలిపారు. ఆలయం అభివృద్ధికి సహకరించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి ఆయా కుల సంఘ నాయకులు సభ్యులు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘం నాయకులు పున్న లక్ష్మణ్, పున్న రాములు, భూపాల్ లక్ష్మణ్, పెద్దిరెడ్డి నారాయణ, రవీందర్ రెడ్డి, కొండ అంజయ్య, కొండ శ్రీనివాస్, కొండ లక్ష్మీనారాయణ,తిప్పాపురం రవి, గాలయ్య, తదితరులు పాల్గొన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!