ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్..

ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్..

దివంగత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28 (అఖండ భూమి న్యూస్)

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్ర శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకొని దోమకొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన ఘనత ఎన్టీ రామారావు కు దక్కిందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. అలాంటి మహానాయకుని ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది రోగులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!