అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి…

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి…

బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాయి కృష్ణ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి పట్టణ కేంద్రంలో విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బహుజన డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల సాయికృష్ణ బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి డి. రాజు ను కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల సాయి కృష్ణ మాట్లాడుతూ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల

1)శ్లోక బ్రాంచ్-2

2) రోజ్వుడ్ ఛాంపియన్ 3)విఐపి యూనివర్సల్ స్కూల్

4) ప్రెసిడెన్సీయల్ స్కూల్

5)నారాయణ స్కూల్

6) ఆరంభ స్కూల్ 7)వివేకానంద బి టాపర్స్ స్కూల్ లకు

తేదీ: 22/ 5/ 2025,శుక్రవారం నాడు, ఇట్టి పాఠశాలలకు ఎటువంటి అనుమతులు లేవని కామారెడ్డి జిల్లా డీఈవో గారు అధికారికంగా పత్రికా ప్రకటన చేయడం జరిగిందన్నారు. అయినా ఈ పాఠశాలలు కామారెడ్డి జిల్లా డీఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కరపత్రాల రూపంలో వాళ్ల పిఆర్ఓ లను ,కామారెడ్డి పట్టణంలో నీ కాలనీలలో తిప్పుతూ మా పాఠశాలలకు అన్ని అనుమతులు ఉన్నాయి, అని విద్యార్థిని ,విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అసత్య ప్రచారం చేస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నారని ఇలాంటి పాఠశాలలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న” ప్రైవేటు విద్యా మాఫియా” పై పూర్తి ఆధారాలతో ఆయన కలిసి అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!