పేదింటి ఆడపిల్ల వివాహానికి పూస్తే,మట్టెలు అందజేత..
108 మంది కి పుస్తే,మట్టెలు అందజేస్తామన్న అయిత బాలకిషన్ లలిత దంపతులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 29 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అయిత బాలచంద్రం లలిత దంపతులు మద్దికుంట గ్రామానికి చెందిన తోట బిక్షపతి చిన్న లక్ష్మి ల కుమార్తె అంజలి వివాహానికి పుస్తె మట్టే లను శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయంలో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో కోట్ల రూపాయల డబ్బు ఉన్న పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన కొద్దిమందిలో మాత్రమే ఉంటుందని అలాంటి వారిలో అయిత బాలచంద్రం లలిత దంపతులు ఒకరని అన్నారు,108 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే,మట్టలు ఇవ్వడానికి ముందుకు రావడం వారికి ఉన్న సామాజిక సేవ కునిదర్శనమని వారికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు 30 మందికి పుస్తె మట్టలను అందజేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్, గోవింద్ భాస్కర్,శ్రావణి, స్వరూప లు పాల్గొనడం జరిగింది.