రైల్వే స్టేషన్లలో టికెట్ లేకుండా ప్రయాణం ఇక కష్టమే..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 1 (అఖండ భూమి న్యూస్)
రైల్వే స్టేషన్ లలో టికెట్ లేకుండా ప్రయాణం ఇక కష్టమే, ఇండియన్ రైల్వేలు కొత్త టెక్నాలజీతో ముందుకు వస్తున్నాయి. మెట్రో తరహాలో ఆటోమేటెడ్ ఎంట్రీ/ఎగ్జిట్ గేట్లు త్వరలో రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే..
ప్రయాణికులు టికెట్‌ను (ఫిజికల్ / డిజిటల్) స్కాన్ చేసి గేట్ ద్వారా ప్రవేశిస్తారు.
టికెట్ లేకపోతే ఎంట్రీకి అనుమతి ఉండదు జస్ట్ లైక్ ఇప్పుడు మెట్రో స్టేషన్ లలో లాగే..
ఇది ఎలక్ట్రానిక్ టికెట్ వాలిడేషన్ సిస్టమ్ (ఈటీవీ ఎస్) ఆధారంగా పనిచేస్తుంది.
మొదటి దశలో 10 మెట్రో తరహా రైల్వే స్టేషన్లలో అమలు చేస్తారు అవి న్యూఢిల్లీ,, ముంబై, హైదరాబాద్, బెంగళూరు మొదలైనవి.
ఈ కొత్త సిస్టమ్ ద్వారా ప్రయోజనాలు చూస్తే వేగవంతమైన ఎంట్రీ & ఎగ్జిట్ రద్దీ తగ్గుతుంద .టికెట్‌లు ఆటో వెరిఫికేషన్ మానవ తప్పిదాలు లేకుండా భద్రత పెరుగుతుంది అనధికారిక ప్రవేశం నివారణ అవుతుంది. ఇది డిజిటల్ టికెటింగ్‌కు సపోర్ట్ యు టి ఎస్, ఐ ఆర్ సి టీఎస్ యాప్స్‌తో సమన్వయంతో. ట్రాకింగ్& రెవెన్యూ పెరుగుదల టికెట్‌లేని ప్రయాణాన్ని తగ్గించడమే కాకుండా డిజిటల్ఇండియా లక్ష్యానికి ఇది మరో బలమైన అడుగు.