ఘనంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 

ఘనంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్);

భారత దేశంలో ఏ ప్రజా కాంక్ష కైనా బాబా సాహెబ్ అంబేద్కర్ దానికి మద్దతుగా రాజ్యాంగం వ్రాసారు అంటే భవిష్యత్ ఉద్యమాలను ముందే ఉహించడం లో బాబా సాహెబ్ ని మించి ఇంకొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు .

తెలంగాణ ఉద్యమానికి వెన్ను దన్నుగా ఉన్న భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 భారత దేశములో 29 వ రాష్ట్రం గా తెలంగాణా అవిర్భవిoచేల చేసింది. ఎన్ని త్యాగాలు ఎన్ని ఉద్యమాలు తెలంగాణ లో చేసినా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 లో రాష్ట్రాల విభజన అంత సులువు చేసి ఉండక పొతే తెలంగాణా పొందేవారిమి కాదన్నది అక్షర సత్యం .

తెలంగాణ ఉద్యమ చరిత్ర – బాబా సాహెబ్ ఆలోచన :

భారత దేశము స్వాతంత్రం నాటికి ఈ దేశములో రెండు విభాగాల పరిపాలన ఉండేది .i) బ్రిటిష్ ఆదీనం లో ఉన్న పాలన

ii) సంస్థానాలు గా ఉన్న పాలన

సుమారు 600 సంస్తానాలు ఈ దేశములో ఉండేవి అందులో ఒకటి నిజాం నవ్బు ఏలుబడి లో ఉన్న హైదరాబాద్ సంస్థానo .

తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడి లో ఉన్న సమయం లో కూడా బ్రాహ్మణీయ వ్యవస్థ ఆదీనం లోని కుల వ్యవస్థ ఉండేది .జాగిర్దారు లు ,పట్వారీలు పటేల్ లు గా ఈ నిజాం ఏలుబడి లో ఆదిపత్య కులాలకు చెందిన వారు ఉండేవారు . ఈ నిజాం ఏలుబడి లో ఉన్న భూమి మొత్తఃమ కూడా జమిందారుల దగ్గర ఉండేది .వెనక బడిన కులాలను ఆదిపత్య కులాలను చాకిరి చేయిన్చుకోనేవారు .దళిత కులాల వారిని మాత్రం బానిసలుగా అంటరాని వారుగా చూసే వారు ,జమిందారులు ఈ నిజాం కి కప్పం కట్టడం వలన నిజాం ఈ విషయాలపై అంత పట్టించుకునే వారు కాదు అన్నది నిజం .

1947 తరువాత జరిగిన పరిణామాల నెపత్యం లో 1955 లోమొదటి SRC ని వేయడం జరిగింది .అది ఒకే బాష మాట్లాడే వారికి ఒకే రాష్ట్రం గా ఉండాలన్న ప్రాతిపాదిక న జరిగింది . 1952 , 15 డిసెంబర్ నాడు గాంధేయవాది పొట్టి శ్రీరాములు నిరహర దీక్ష సుదీర్ఘం గా (58 రోజులు ) చేసి చనిపోవడం జరిగింది .ఈ సంఘటన భాష ప్రాతిపాదిక రాష్ట్రాలకు భాటలు వేస్తూ 1956 నవంబెర్ ఒకటి నా హైదరాబాద్ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రం ఒకే రాష్ట్రం గా జెంటిల్మెన్ ఒప్పందం తో ఒకే రాష్ట్రం గా మారాయి .కాని 1955 లోనే బాబ్ సాహెబ్ గారు భాష ప్రాతిపదిక రాష్ట్రాలు ఒక కుట్రని.

బాబా సాహెబ్ గారు 1955 లో “THOUGHTS ON LINGUISTIC STATES” అనే బుక్ వ్రాసారు మీకు అది ఇప్పుడు పిడిఎఫ్ లో గూగుల్ లో కూడా దొరుకుతుంది .అందులో క్లుప్తంగా గట్టిగ చిన్న రాష్ట్రాలను కాంక్షించారు .1955 లోనే బాబా సాహెబ్ హైదరాబాద్ రాష్ట్రం లో ఉన్న ఒక్క కోటి జనాభా ప్రత్యెక రాష్ట్రం గా ఉండాలి అని కాక్షించారు .ఉత్తర్ ప్రదేశ్ ని ,మహారాష్ట్ర ని కూడా రాష్ట్రాలుగా విభజించాలి అని చెప్పారు .ఇవన్ని చెబుతూనే తను అర్టికల్ 3 వలన చిన్న రాష్ట్రాల ఏర్పాటు అ౦త సులువుగా పార్లమెంట్ లో బిల్లు అయ్యేలా చేసాను అని ఆబుక్ లో చెప్పడం జరిగింది .

ఆర్టికల్ 3 ;

I ) చిన్నరాష్ట్రాలు ఏర్పాటు ….

2 ) ముజు వాణి ఓటుతో రాష్ట్రాల ఏర్పాటు

3) రాష్ట్ర అసెంబ్లీ లా ఆమోదం ప్రహసనమే

4 ) మొత్తం సభ్యులలో ఒక్క వోటు తో రాష్ట్ర ఏర్పాటు

5 ) చేయ్యిత్తి లెక్కపెట్టిన చాలు రాష్ట్రాల ఏర్పాటు .

6 ) రాష్ట్ర సరిహద్దుల నిర్ణయం అదే రోజు .

7 )లోక్ సభ లో బిల్లు అయిన తరువాత రాజ్య సభలో ప్రహసనమే

8 ) బిల్లు కి రాష్ట్ర పతి ఆమోదం తో రాష్ట్రం ఏర్పాటు …..అసెంబ్లీ లో తీర్మానం అవసరమే లేదు .

బాబా సాహేబ్ అంబేద్కర్ గారు ఈ దేశం ఇండియా సంయుక్త రాష్ట్రాలుగా ఉండాలి అని కాంక్షించారు .అలా అయితే పరిపాలన ప్రజల వద్దకు వెళుతుంది .దానివలన అణగారిన వర్గాల ప్రజలు ,అంటరాని కులాలుగా పిలువబడ్డ ప్రజలకు పరిపాలన దగర అవుతుంది అని అనుకున్నారు.పల్లెలు తొ౦దరగా పట్టణీకరణ చెందితే కొంత అస్పృశ్యత కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అని అనుకున్నారు. సుమారు రెండు కోట్ల జనాభాకు ఒక్క రాష్ట్రం ఉండాలి అన్నది ఆయన ఆలోచన .

ఉద్యమాల తెలంగాణ ,అమరుల తెలంగాణా ఇది బాబా సాహెబ్ తెలంగాణా అన్నది అక్షర సత్యం .

బాబా సాహెబ్ ఈ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ౦ రోజు గుర్తించుకుంటూ నివాళులు అర్పిద్దాం .

Akhand Bhoomi News

error: Content is protected !!