ఘనంగా యోగ అంతర్జాతీయ దినోత్సవ దశాబ్ది వేడుకలు…

ఘనంగా యోగ అంతర్జాతీయ దినోత్సవ దశాబ్ది వేడుకలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; (అఖండ భూమి న్యూస్);

యోగదినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో ‘యోగ వాక్’.

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మంగళవారం “యోగ వాక్” నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో, పతంజలి యోగ సంస్థ సహకారంతో ఘనంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ వీణ గారు జెండా ఊపి యోగా వాక్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “యోగ ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుంది. ప్రతిరోజూ జీవన శైలిలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. రాబోయే కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలో ఎంతో ఆంతర్యం ఉంది, అందులో యోగకు ముఖ్యమైన స్థానం ఉంది” అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో యోగా జాగ్రత్తలు ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది.

ఈ యోగ వాక్‌లో ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, వైద్యాధికారులు డా. వెంకటేశ్వర్లు, డా. దేవయ్య, డా. నీలిమా, డా. విజయ, డా. విజయలక్ష్మి, డా. చైతన్య, డా. నహీద, ఇతర వైద్య సిబ్బంది గోపాల్, శ్రీనివాస్, మహమ్మద్ బైగు, యోగా శిక్షకులు, పతంజలి కుటుంబ సభ్యులు మరియు ఆయుష్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!