నిజాంసాగర్ బ్యాక్ వాటర్స్ లో ఈతకు వెళ్లి మరణించిన వారిని సందర్శించిన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి …

నిజాంసాగర్ బ్యాక్ వాటర్స్ లో ఈతకు వెళ్లి మరణించిన వారిని సందర్శించిన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 3 (అఖండ భూమి న్యూస్)

ఎల్లారెడ్డి మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్స్ లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతు అయి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి గాలింపు చర్యలు చెప్పట్టాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం చనిపోయిన విద్యార్థుల భౌతిక కాయలకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులు చనిపోవడం చాల బాధాకరం అని అన్నారు. చేతికి అందివచ్చిన కొడుకులను కొలిపోయారాని విద్యార్థుల తల్లితండ్రులకు తీరని లోటు అన్నారు. విషయం తెలియగానే తాను తీవ్ర మనస్థాపానికి గురి అయినట్టు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని జిల్ల కలెక్టర్ కు తెలిపారు. ప్రభుత్వం నుండి సహాయం వారి కుటుంబాలకు అందేలా చూస్తాము అని అన్నారు.

ఈ కార్యకరంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామా కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!