బక్రీద్ పండుగను శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపు కోవాలి…
కామారెడ్డి.జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 3 (అఖండ భూమి న్యూస్) బక్రీద్ పండుగను శాంతియుతంగా,మత సామరస్యంతో జరుపుకోవాలని
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 7న బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ , పశుసంవర్ధక, రెవిన్యూ, రవాణా,మున్సిపల్ కమీషనర్స్ ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ , జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర , అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం జరిగింది.బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి, ప్రార్థనా స్థలాల పరిశుభ్రత, గోవుల అక్రమ రవాణాను నివారించడం మరియు , బందోబస్తు నిర్వహణ ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత సామరస్యానికి చిహ్నంగా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులను ఏర్పాటుచేయాలని పోలీసుశాఖకు సూచించారు.
గోవులను రక్షించడంలో భాగంగా పోలీస్ శాఖ వాహనాలను
సీజ్ చేసినప్పుడు గోవులను గోశాలకు తరలించినప్పుడు వాటికి
ఆహారం అందించడానికి మున్సిపల్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలన్నారు.
బక్రీద్ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు సహకారం అందించాలని తెలిపారు.
ప్రార్థనా స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు మరియు అధికారులకు తెలియజేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందిన వారైనా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరుగుతుందని
ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు
సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే జిల్లాలో పోలీస్ అధికారులు దృష్టికి తీసుకురావాలని స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఆర్డీవో వీణ,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి,మున్సిపల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రవాణా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.