పత్రిక ప్రకటన జూన్ 03, 2025 -కామారెడ్డి :

భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం…

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 3 (అఖండ భూమి న్యూస్)

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.మంగళవారం మాచారెడ్డి కేంద్రంలో గజ్జ నాయక్ తండలో రైతు వేదిక నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయని, నేటి నుండి జూన్ 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వెల్లడించారు.

సదస్సుల్లో పాల్గొన్న ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు సుమారు 100 మంది రైతులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు

ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) విక్టర్, ఆర్డిఓ కామారెడ్డి వీణ, మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్, తహసీల్దార్లు సరళ, ఎంపీడీవో , ఎస్సై అనిల్, వ్యవసాయ అధికారి పవన్ ఎఫ్ ఆర్ ఓ దివ్య , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!