నీటిలో మునిగిన ముగ్గురు యువకుల మృతదేహలు లభ్యం

నీటిలో మునిగిన ముగ్గురు యువకుల మృతదేహలు లభ్యం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్- 3(అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో నిన్న ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మధుకర్ గౌడ్(18), ఐతే నవీన్ (21) హర్ష వర్ధన్ (17)అనే ముగ్గురు యువకుల మృతదేహాలు మంగళవారం మధ్యాహ్నం వరకు లభించాయి. ఉదయం 8 గంటలకు మధుకర్ గౌడ్, ఉదయం 11:30 గంటలకు నవీన్, మధ్యాహ్నం ఒంటిగంటకు హర్షవర్ధన్ లను మృతదేహలను గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. లభ్యమైన యువకుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఘటన అక్కడివారిని కలచివేసింది. ముగ్గురి యువకుల మృతదేహలను పోలీసులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!