శ్రీలక్ష్మి భూదేవి చెన్నకేశవ స్వామి కళ్యాణం…
వెల్దుర్తి జూన్ 04 (అఖండ భూమి) : మండల పరిధిలోని ఎస్ పేరామల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ భూదేవి, చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవం శనివారం పగలు 12 గంటల ఐదు నిమిషములకు జరుగుతున్నట్లు గ్రామ పెద్దలు విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తారీకు శుక్రవారం నుండి 7వ తారీకు శనివారం వరకు స్వామివార్ల మహోత్సవాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం వేద పండితులచే నిర్వహించబడుతున్నట్లు గ్రామ ప్రజలు భక్తులు తెలిపారు. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నము అన్నదానం దాతలు కీర్తిశేషులు బొంతల లక్ష్మిరెడ్డి శ్రీమతి బొంతల లక్ష్మీ దేవమ్మ గార్ల కుమారులు బొంతల రామకృష్ణారెడ్డి ధర్మపత్ని శ్రీ మతి రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు ద్వారా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవానికి అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. భక్తాదులందరూ పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని దిగ్విజయం చేయాలని గ్రామ ప్రజలు కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



