కర్నూల్ జిల్లా అఖండ భూమి వెబ్ న్యూస్ :
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్

స్పందన కార్యక్రమానికి 87 ఫిర్యాదులు .
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 87 ఫిర్యాదులు వచ్చాయి
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) కుమారుడు అన్నం పెడుతుంటే, మనుమలు, కోడలు అడ్డుపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు.
2) నా భర్త చనిపోయిన తర్వాత నా భర్తకు రావాల్సిన ఆస్తిని నా మరిది ఇవ్వకుండా నా పిల్లలకి అన్యాయం చేస్తున్నాడని గార్గేయపురం కు చెందిన రాములమ్మ ఫిర్యాదు చేశారు.
3) నా కోడలు వారి బంధువులను పిలిచి నాపై దాడి చేయిస్తుందని పత్తికొండకు చెందిన పుష్ప భాయి ఫిర్యాదు చేశారు.
4) మద్దికేరలో డిగ్రీ చదివి పాస్ అయినాను , నా మార్క్ లిస్ట్ అడిగితే ఇవ్వకుండా కోవిడ్ సమయంలో పోయిందని కాలయాపన చేస్తూ ఇబ్బందుల కు చేస్తున్నాడని గుంతకల్లు మండలం, కాశాపురం గ్రామానికి చెందిన రాజు ఫిర్యాదు చేశారు.
5) నా భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు, కుమారుడు , కుమార్తె ఉన్నారు. నా భర్త తరఫున బంధువులు నా ఫై అనుమానం పెంచి నా భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారని ఎమ్మిగనూరుకు చెందిన ఫరీదాబాను ఫిర్యాదు చేశారు.
6) హైదరాబాద్ కు చెందిన వ్యక్తి వికలాంగుల కోట కింద రైల్వే ఉద్యోగం ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశాడని కోడుమూరు చెందిన ఈశ్వరమ్మ చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ హామీ ఇచ్చారు.
ఈ స్పందన కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పి శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ ,లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


