దోమకొండ ఫోర్ట్ & విలేజ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 5 (అఖండ భూమి న్యూస్)
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పోర్ట్ & విలేజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. దీంట్లో భాగంగానే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం & డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ వారి సహకారంతో గురువారం దోమకొండలో నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జిల్లా అడవిశాఖ అధికారి నికిత, రేంజ్ ఆఫీసర్ దివ్యశాఖ సిబ్బంది హాజరయ్యారు. పర్యావరణం పెంచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ గురించి చైతన్య పరిశోధనలతో పాటు అటవీ శాఖ వారు పండ్ల మొక్కలను 170 కుటుంబాలకు అందించడం జరిగింది. ప్రజల్లో పర్యావరణ సమస్యలపై అవగాహన పెరిగే అవకాశం ఉంటుందన్నారు. వాయు, కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్ధాలు, వన్యప్రాణుల సంక్షోభం, వాతావరణ మార్పులు, ప్రకృతిని కాపాడే చర్యలకు ప్రోత్సహం ప్రభుత్వాలు సంస్థలు విద్యార్థులు, సాధారణ ప్రజల పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయడానికి ఒక ప్రేమ ఉన్నదా తీసుకోవాలన్నారు. ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఒకే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి సంవత్సరం ఓ థీమ్, ప్రతి సంవత్సరం ఓ ప్రత్యేకమైన థీమ్ ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్లాస్టిక్ నియంత్రణ అంశాన్ని విపులంగా తెలియజేశామని అన్నారు. సమాజం వల్ల మన బాధ్యత మొక్కలు నాటడం,, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పరిరక్షించడం, పునర్వినియోగ సామాగ్రిని ఉపయోగించడం, బయో విజ్ఞతను కాపాడడం ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకు గుర్తు చేసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమి మన ఇంటి వల్లే దాని కాపాడడం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ పోర్ట్ & డెవలప్మెంట్ అధికారి బాబ్జి, గణేష్, ప్రజా ప్రతినిధులు,, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.