మిల్లర్లు సి ఎమ్ ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలి.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 5 (అఖండ భూమి న్యూస్)
మిల్లర్లు సి ఎమ్ ఆర్. డెలివరిని త్వరితగతిన పూర్తి చేయాలని బ్యాంక్ గ్యారెంటిలు సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సం గ్వాన్ ఆదేశించారు. ఐ డి ఒ సి కార్యాలయపు కాన్ఫరెన్స్ హాలులో రైస్ మిల్లర్ల, పౌరసరఫరాల అదికారులతో సి ఎమ్ ఆర్ డెలివరి గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్లు సి ఎమ్ ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వం రబీ 2023-24 27 జూలై 2025 వ తేదీ వరకు గడువు ఇచ్చిందని పెండింగ్ సి ఎమ్ ఆర్ డెలివరి పూర్తి చేయాలని అన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా మిల్లింగ్ జరగాలని, నిర్ణీత సమయానికి సి ఎమ్ ఆర్ డెలివరి పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. సి ఎమ్ ఆర్. డెలివరి చేయని మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని 100 శాతం సి ఎమ్ ఆర్. డెలివరి చేయాలని మిల్లులకు అలాగే 100% సి.ఎం.ఆర్. పూర్తి చేసేల అధికారులు ప్రణాళిక తయారు చేయాలనీ గడువులోగా సి.ఎం.ఆర్. అందించాలని మరియు బ్యాంక్ గ్యారెంటిలు వారం లోగ జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, డి సి ఎస్.ఓ మల్లిఖార్జున బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా రైస్ మిల్లర్ కార్యవర్గం, జిల్లాలోని బాయిల్డ్ & రా రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.