శాశ్వత పరిష్కారమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 5 (అఖండ భూమి న్యూస్)
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం భూభారతి రెవిన్యూ సదస్సు సాధశివనగర్ మండలంలోని యాచారం గ్రామంలో పాల్గొని భూ సమస్యలు పరిష్కారం కోసం ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు, యాచారం గ్రామంలోని రేషన్ బియ్యం పంపిణీ పనితీరు పరిశీలించి సక్రమంగా పంపిణీ చేయమని ఆదేశించడం జరిగింది. యాచారం గ్రామంలో బి గణేష్ ఇందిరమ్మ ఇల్లు మార్కింగ్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు తొందరగా గృహ నిర్మాణం చేసుకోవాలని బిల్లులు మంజూరు కూడా వెంటనే చేయడం జరుగుతుంది అని తెలపడం జరిగింది. మరియు వజపల్లి తండా గ్రామంలో పశువుల షెడ్డు, ఫాo పౌండ్, నర్సరీ , ప్రకృతి వనం సందర్శించారు వర్షపు నీటి సంరక్షణ కోసం రైతుల విధిగా పామ్ పౌండ్ ఉపాధి హామీ పథకంలో నిర్మించుకోవాలని సూచించారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినం పురస్కరించుకొని యాచారం మరియు వజపల్లి తాండ గ్రామంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్, రెవిన్యూ డివిజనల్ అధికారి వీణ, PD హౌసింగ్ విజయపాల్ రెడ్డి, డిస్టిక్ సివిల్ సప్లై అధికారి మల్లికార్జున, జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి,మండల స్థాయి అధికారులు ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపిఓ సురేందర్ రెడ్డి, ఎంఈఓ యోసెఫ్, ఏపీఎం రాజారెడ్డి, ఏపీవో శ్రీనివాస్ ఏఈ హౌసింగ్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు