11 సంవత్సరాలు కేంద్రంలో మోడీ విజయాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 6 (అఖండ భూమి న్యూస్)
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దేవునిపల్లి మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండపంలో పట్టణ ఉపాధ్యక్షులు చిన్నోళ్ల రజనీకాంత్ రావు గారి అధ్యక్షతన *11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం – సంకల్ప సహకారం* కార్యక్రమంలో భాగంగా *కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం* నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన *రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ విపుల్ జైన్ మాట్లాడుతూ. మోది ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా సాధించిన విజయాలు పట్టణంలోని 49 వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని, కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శాసన సభ్యులు గా ఎన్నికైన నాటి నుండి అవినీతి రహిత కామారెడ్డి గా, నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ అవినీతి రహిత భారత్ గా స్కాం లు లేని భారత్ గా ముందుకు సాగుతుందని ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికి వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.