ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా విరాళం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 6 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా :లింగంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్తడి పోచమ్మ ఆలయ నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జాగృతి యువజన విభాగం కన్వీనర్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ రెండు లక్షల పదకొండు వేల రూపాయలు విరాళాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ధూర్శెట్టి అశోక్, కోశాధికారి గుజ్జరి మారుతి, గౌరవ అధ్యక్షులు శంకర్ గౌడ్, ఆలయ కార్యవర్గ సభ్యులు రాజారాం బాలయ్య, పోకల సాయిరాం, సుప్పాల నారాయణ, బైరయ్య, గుండ బాలకిషన్ పాల్గొన్నారు.