యోగా అవగాహన కార్యక్రమం:

అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యోగా అవగాహన కార్యక్రమం:

అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు యోగ అవగాహన మరియు సాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ విక్టర్ గారు, టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి గారు , టిజివోస్ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి గార్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ముఖ్యమైన అంశాలపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –

“నిత్యజీవితంలో యోగాన్ని భాగంగా చేసుకోవాలి. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగ సాధన తప్పనిసరి. ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి, అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో మరో ముఖ్యాంశంగా, “ఆయుర్ చైతన్యం ఆయుర్వేద మరియు పంచకర్మ వైద్యశాల” ప్రోప్రైటర్ డాక్టర్ చైతన్య సురేష్ గారి సహకారంతో యోగ శిక్షకులు మరియు యోగ సాధకులకు ప్రత్యేకంగా రూపొందించిన స్పాన్సర్డ్ T-షర్ట్స్ ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

TNGOs సహాధ్యక్షులు M. చక్రధర్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ గణేష్,TGOs సంయుక్త కార్యదర్శి నరసింహులు ,జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, ఆయుష్ వైద్యాధికారులు డా. వెంకటేశ్వర్లు, డా. దేవయ్య, డా. విజయ, డా. చైతన్య, డా. నసీం సుల్తానా,ఆయుష్ పారామెడికల్ సిబ్బంది శ్రీనివాస్, మహమ్మద్ బైగు, కిషోర్,యోగ శిక్షకులు, ఇతర శాఖల అధికారులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!