మోడీ 11 సంవత్సరాల పాలన తో భారత్ అభివృద్ధి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 6 (అఖండ భూమి న్యూస్)
11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించడానికి, వికసిత్ భారత్ ఎలా సాకారం అవుతుందో అని సంకల్పంతో సహకారం పేరుతో శుక్రవారం రాజంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ. 11 ఏళ్ళల్లో భారత్ ఎలా అభివృద్ధి చెందిందో, యావత్ భారతదేశ ప్రజలు గమనించాలని అన్నారు. అలాగే ఇంటింటికి గడపగడపకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతామని ఇక ముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం చేపట్టనుందో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళతాం అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.