బైకు ప్రమాదంలో ఒకరు మృతి ఒకరికి గాయాలు..
వెల్దుర్తి జూన్ 06 (అఖండ భూమి) : వెల్దుర్తి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో నక్కల తిప్పే దగ్గర బైకు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెంది మరొకరికి గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో అనంతపూర్ టౌన్ కు చెందిన రాసినేని కనకదుర్గ మరియు వైష్ణవి ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్ పై వెలుగోడు మండలం రేగడ గూడూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట నిమిత్తం వెళుతుండగా తమ మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడినారు మోటర్ సైకిల్ నడుపుతున్న వైష్ణవి వయసు 33 సంవత్సరములు అను ఈమె అక్కడికక్కడే చనిపోయినది . రాసినేని కనకదుర్గ ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసు వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



