గూడు లేని ప్రతి ఒక్క దరఖాస్తు దారుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి న్యూస్)
ఉండడానికి గూడు లేని ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం దోమకొండ మండల కేంద్రంలో నీ ఇందిరమ్మ నమూనా ఇల్లు నిర్మాణాన్ని పరిశీలించి అనంతరం ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేసి ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఇంద్రమ్మ ఇల్లు పనులను ముగ్గువేసి ప్రారంభించారు
రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టించి హామీలను అమలు చేస్తున్నాం
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ దళితుల ఇంటి పార్టీ
కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుంది అని గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను
మంజూరు చేసాం ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున
మంజూరయ్యాయి అని అన్నారు.
కామారెడ్డి నియోజకవర్గానికి 3028
మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది త్వరలో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన
ఆరు హామీలను అమలు చేస్తూ
ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నాం అన్నారు.
500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,
2 లక్షల రుణమాఫీ రైతు భరోస అందజేస్తున్నాం అన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించడంతోపాటు
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ చెక్కులను సకాలంలో అందజేస్తున్నాం అన్నారు.
పేద ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, దోమకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అబ్రబోయిన స్వామి, తీగల తిరుమల గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ ఐరేని నర్సయ్య, సీతారాం మధు, నల్లపు అంజలి శ్రీనివాస్, కదిరి గోపాల్ రెడ్డి, అండం శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, షమ్మీ,, నిమ్మ బాల్ రాజ్, నాగారపు రాములు , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.