ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి వెబ్ న్యూస్)
చాముండేశ్వరి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో చాముండేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ గా పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, ధర్మకర్తలుగా నార్ల వెంకటేశం, నర్రాగుల ఎల్లయ్య, నిమ్మ రాజేశ్వరి, పులే బోయిన రమేష్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై సందర్భంగా మాట్లాడారు. దోమకొండ చాముండేశ్వరి ఆలయం మహిమగల దేవత అని ఆలయ అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వపరంగా, సొంత నిధులను సైతం అందించి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు మహంకాళి జాతరకు బోనాలు పెట్టుకునేందుకు షెడ్డు ఏర్పాటుకు కొంతమంది విరాళాధాతలతోపాటు తాను ప్రభుత్వ సహకారంతో పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రజలు భక్తి మార్గంతో పాటు అందరికీ ఉపయోగపడే పనులను సమాజం కోసం ప్రతి ఒక్కరి కృషి చేయాలని అన్నారు. చాముండేశ్వరి ఆలయం ప్రస్తుతం ప్రభుత్వ దేవాదాయశాఖ ఆధీనంలో ఉంటుందని భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో మరింత రూపురేఖలు మార్చుకోవాలని అన్నారు. అందరి కృషి ఉంటేనే ఆలయాల అభివృద్ధి తో పాటు గ్రామాల అభివృద్ధి ముందుకు సాగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు దోమకొండ గ్రామస్తులు పాల్గొన్నారు.