“మీరే ఆలోచించండి”
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి వెబ్ న్యూస్) :
తల్లిదండ్రులు తమ పిల్లలమీద
ఎన్నెన్నో ఆశలు పెంచుకొని
ఎన్నో ఊహలను ప్రోగుచేసుకొని
కళ్ళల్లో ఎన్నో కలలను నింపుకొని
మనసునిండా కోరికల కోలాహలమే.
బడికి వేసినప్పటినుంచి
తమ భవిష్యత్తుకు ముడివేసుకొని
ఆశల అలల వలల స్పందనలు
ఇదే నేటి తల్లిదండ్రుల మంత్రం
సమాజంలో నడుస్తున్న తీరు
స్వేచ్చను చంపేసి ఆటపాటలను అంతం చేసి
ఉరుకుపరుగులను పాతరేస్తున్నారు.
మానసికంగా శారీరకంగా కుంగిపోతున్నా పిల్లలు
ఆ చదువులను అందుకోలేక
ఆఎత్తులకు ఎక్కలేక ఎన్నో లొసగులతో
మానసిక వత్తిళ్లకు లోనవుతున్నారు.
తరలి వెళ్ళుచున్న ఆశయాల ఆస్తులను
పరుగెత్తి పట్టుకో చూపించు నీశక్తి
మీరు తెచ్చే ఫలితం మాకే సొంతం.
కదులుతున్న కాలాన్ని వెంబడించు
మా ఆశల ఆలోచనాలకు పాత్రులుకండి.
ఎన్నెన్నో పొందడానికి మరెన్నో అందుకోవడానికి
పిలల్ని అడ్డుపెట్టుకుని ఆశల నిచ్చెనలు వేస్తారు.
తల్లిదండ్రులే పిల్లలకు భూతం
మోయలేని చదువుల మోతతో
ఆ చిన్ని హృదయాలను గాయం చేస్తున్నారు.
ఉగ్గుపాలను తాపి అవే పాలను కక్కిస్తారు.
ఇష్టంలేని చదువుతో కష్టాన్ని తెప్పిస్తారు.
నేటితల్లిదండ్రులు గురువులై దారిచూపి
వారే దారి దోపిడి చేస్తున్నారు.
తల్లిదండ్రులు ఆశల నిషాలో ఉంటూ
మొగ్గలాంటి పసిపిల్లల్ని బలి చేస్తున్నారు.
ప్రేమకు ఆప్యాయతకి దూరమై
పిల్లల పాలిట రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు.
అనుకున్న ఊహలు
తారుమారు అయితే తట్టుకోలేరు
కన్న ప్రేమ చివరికి
ఓ ప్రశ్నర్థకంగా మిగులుతుంది
పిల్లలమీదపెట్టుకున్న
విశ్వాసం విషంగా మారుతుంది!
పిల్లలమీద ఎన్ని కసరత్తులో
ఎన్నెన్ని సర్వేలో
ఇది జనంలో జరుగుతున్న ఘనమైన వాస్తవం.
ప్రేమను పెంచుకోవలసిన తల్లిదండ్రులే
చదువుల కొరకు ప్రేమనుదూరముంచి
పిల్లల్లో ఓరకమైన ప్రేమానుబంధం దూరమవుతుంది.
పిల్లలపై ఉరుకు పరుగులు వద్దు.
మీ ప్రతి రూపాలు లేత రెక్కలు
ఇప్పుడిప్పుడే వికసిస్తున్న మెదడు
మీ పేగును తెంచుకొని పుట్టినవారు.
మీ నెపం కొరకు ప్రేమను చంపొద్దు.
మీ ఒత్తిళ్లకు చిన్న మెదడు చిట్లి పోతుంది.
తల్లిదండ్రులారా ఆలోచించండి!