మా వార్డుకు తాగునీటి సమస్య తీర్చి పన్ను వసూలు చేయండి..

మా వార్డుకు తాగునీటి సమస్య తీర్చి పన్ను వసూలు చేయండి..

లేదంటే పన్ను వసూలు చేయడానికి వచ్చిన పంచాయతీ సిబ్బందిపై తిరుగుబాటు చేస్తాం..

సంవత్సరము నుండి తాగునీటి కష్టాలు..

పట్టించుకోని గ్రామ సర్పంచ్..

అఖండ భూమి వెబ్ న్యూస్ :

కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ లో వార్డు సమస్యలు తీర్చి పన్ను వసూలు చేయాలని వెల్దుర్తి పట్టణానికి చెందిన మహిళలు గ్రామ సర్పంచ్ ను కోరారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారన్నారు. సర్పంచ్ పదవిగా ఉండి నాలుగు సంవత్సరాలు గడిచిన చేసింది ఏమీ లేదని విమర్శించారు.
మేజర్ గ్రామపంచాయతీ లోని 15, 16 వార్డులలో తాగునీటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వైనం శనివారం చోటుచేసుకుంది. గత రెండు సంవత్సరాల నుండి మా వార్డుకు తాగునీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విలేకరులకు తెలిపారు. కనీసం స్నానాలు చేయడానికి కూడా చుక్కనీరు లేదని వాపోతున్నారు. మా ఇండ్లకు బంధువులు వస్తే కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. మా వార్డు సమస్య లు తీర్చితేనే ఇంటి పన్ను గాని నీటి పన్ను చెల్లిస్తామని లేకపోతే వసూలు చేయడానికి వచ్చిన వారిపై తిరగబాటు చేస్తామని హెచ్చరించారు. తాగునీరు సమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!