హనుమాన్ ఆలయం పున ప్రతిష్టాపనకు కవిత చేతుల మీదుగా విరాళం …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి వెబ్ న్యూస్)
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని అయిలాపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయం పున ప్రతిష్టాపనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర జాగృతి యువజన విభాగం కన్వీనర్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ. ఆధ్యాత్మిక నిలయాలు ఆలయాలు వాటి పునర్నిర్మాణం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం తాను పుట్టి పెరిగిన గ్రామంలో గ్రామ అభివృద్ధితోపాటు ఆలయాల అభివృద్ధికి పాటుపడుతున్న ఎదురుగట్ల సంపత్ గౌడ్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోకల చిన్న మల్లయ్య, మ్యకలకాడి రాములు, తుమ్మలపల్లి శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ భాస్కర్, సుర్ణ శంకర్ నాగయల బాలయ్య, తాడూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


