జీవితంలో ఒక మైలురాయిని ఎంచుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలి. -ఎస్సై డి. స్రవంతి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్)
విద్యార్థి దశలోనే ఒక మైలు రాయిని ఎంచుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంతవరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ముందుకు సాగాలని దోమకొండ ఎస్సై డి. స్రవంతి అన్నారు. మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముదాం శ్రీవల్లి పదవ తరగతిలో 566 మార్కులు సాధించింది. శ్రీవల్లి భిక్కనూరు మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో విద్యార్థి శ్రీవల్లిని ఎస్సై శాలువా తో సత్కరించి అభినందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ అనుకున్న గోల్ ను రీచ్ అయ్యేంతవరకు కష్టపడాలన్నారు. సాధించాలనే తపన దృఢంగా ఉంటే అనుకున్నది జీవితంలో తప్పకుండా చేరుకోగలమని సూచించారు. ఎంతటి వడిదడుగులు వచ్చిన చదువులో ముందుండాలని, కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, స్వామి పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…