జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలి
– సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణమే విడుదల చేయాలి
– జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చూడాలి
— టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు.
– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 9 (అఖండ భూమి న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని కామారెడ్డి టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఖండించారు. మంగళవారం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జయింట్ కలెక్టర్ ( రెవెన్యూ ) విక్టర్ , జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి ఛానల్ జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, శ్రీనివాసరావుని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో, దేశంలో ఎక్కడైనా జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. జర్నలిస్టుల రక్షణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తయారుచేసి వాటిని అమలు చేసే విధంగా పోలీస్, రెవెన్యూ శాఖలను ఆదేశించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ కృష్ణమాచారి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు కృష్ణమూర్తి, డాకూరి మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి రాములు, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ కే దశరథ్, ఉపాధ్యక్షులు జమాల్పూర్ లక్ష్మణ్, జె. తిరుపతిరెడ్డి, బీసు రాకేష్, సంయుక్త కార్యదర్శి సుంకరి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…