పార్టీ బలోపే దానికి కృషి చేస్తా
టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11 (అఖండ భూమి న్యూస్);
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పార్టీ బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తానని కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినాము ఉంటామని రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానన్నారు. ఎన్నికల అనంతర మున్సిపల్ ఛైర్మన్ గా, ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా పార్టీ తనకు సముచిత స్థానం ఇచ్చిందన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తనపై నమ్మకం ఉంచి టీపీసీసీ సెక్రెటరీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



