కార్యదర్శి హత్య వీడిన మిస్టరీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి అక్రమ సంబంధం పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు బుధవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈనెల 5న ఇంటి నుండి వెళ్లిన చిన్న కొడుకు పంచాయతీ కార్యదర్శి ధారావత్ కృష్ణ తిరిగి రాలేదని కుటుంబ సభ్యుల మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఈనెల 7న చిన్న కొడప్గల్ మండల కేంద్రంలోని రెడ్డి చెరువులో కృష్ణ హత్య కు గురయ్యాడని బాన్సువాడ డిఎస్పి ఆధ్వర్యంలో ప్రత్యేక ధైర్యం బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు పోలీస్ విచారణ చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్య అతని భార్య సుజాత వారి కులస్తులు ఎర్రనోళ్ళ బాలరాజు లింగంపేట మల్కయ్య అనే నలుగురు హత్యకు కారణమని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు 8 నెలల క్రితం సుజాత భర్త మాల్కయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి మూడు నెలల పాటు కూలి పని చేసుకొని తిరిగి వచ్చి గ్రామంలో పనిచేసుకుంటున్నాడని తెలిపారు భార్య సుజాతకు పంచాయితీ కార్యదర్శి కృష్ణతో అక్రమ సంబంధం ఉందని తెలిసి ఇరువురి మధ్య గొడవలు జరిగేదన్నారు భార్యాభర్తల కాపురం చక్కదిద్దుకోవడం కోసం కృష్ణను హత్య చేయాలని ఇద్దరు కులస్తులు సహకారంతో పథకంలో భాగంగా నలుగురు కలిసి కత్తి గొడ్డలి ఇనుపరాడు రోకలితో కొట్టి హత్య చేసి రెడ్డి చెరువులో పారేశారని తెలిపారు ఈ మేరకు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నమని వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి గొడ్డలి ఇనుపరాడు రెండు మోటార్ సైకిల్ నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు కేసు త్వరగా చేదించిన బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి బాన్సువాడ రూలర్ సీఐ రాజేష్ లను ఎస్పీ సిబ్బందిని అభినందించారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



