సేఫ్టీ గార్డ్ తో ఈత కొడుతూ పులి వేసం బంటి వేసం తో నిరసన

కొమరాడ మండలం సాలపదం ఈశ్వరాలయం వద్ద మంగళవారం సేఫ్టీ గార్డ్ తో ఈత కొడుతూ పులి వేసం బంటి వేసం తో నిరసన

పార్వతీపురం మన్యం జిల్లా జూన్ 17 ( అఖండ భూమి న్యూస్) దత్తి మహేశ్వరరావు

 

పార్వతీపురం నుండి కు నేరు మీదుగా మూడు రాష్ట్రాలకెళ్లే అంత రాష్ట్ర రహదారి మార్గంలో గల సోల్ల ళ్ళ పదం దేవాలయం వద్ద గోతులు వద్ద రెండు రోజులుగా కురిసిన వర్షానికి భారీగా నీరు చేరడంతో ఆ గోతులు మరమ్మతు పనులు వేగవంతం చేయాలని వినూతన రీతిలో మంగళవారం నిరసన

 

కనీసం లక్ష రూపాయలు మన పార్వతీపురం పురం జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారుల వద్ద మరియు మన జిల్లా కలెక్టర్ గారు వద్ద లేవా ఎంతమందిని చంపేస్తారు సార్

 

ప్రయాణికులకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారిపై గోతుల్లో సేఫ్టీ గాడ్ సహాయంతో ఈదుతూ ముఖానికి పులి బొమ్మ మరియు బంటి బొమ్మ వేసుకుంటూ పూర్వకాలం అడవుల్లో చెరువులు మాదిరిగా ఈ గోతులు ఉన్నాయంటూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది

 

ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కు నేరు మీదుగా మూడు రాష్ట్రాల కెళ్ళి రహదారి మార్గంలో కొమ్మరకుంట రైల్వే గేట్ సమీపంలోనూ మరియు జంజావతి సెంటర్లోనూ మరియు కోటిపాం బ్రిడ్జి మీద మరియు కోటిపాము జడ్పీ హైస్కూల్ వద్ద మరియు ఇందిరా నగరం వద్ద చోళ పదం దేవాలయం వద్ద అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు కోనేరు గ్రామం వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ప్రతిరోజు వాహనదారులు ఈ గోతుల్లో వరుసపు నీరు ఉండటం వల్ల పడిపోయి అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఈ విషయం పైన అనేకసార్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులు మా దగ్గర పైస లేదంటూ సమాధానం తప్ప ఎక్కడ పూర్తిస్థాయిలో ఈ గోతులు కప్పే పరిస్థితి లేదని గతంలో అనేక విధాలుగా ఆందోళన చేసిన నేపథ్యంలో సంక్రాంతి ముందు పెద్ద పెద్ద గోతులు కప్పారు తప్ప చిన్నచిన్న గోతులు వదిలేయడం వల్ల ఈరోజు మళ్లీ మొదటకి ఈ గోతులు పరిస్థితి వచ్చే పరిస్థితి ఉందని కాబట్టి వెంటనే ఈ ప్పటికైనా ఈ గోతులన్నీ పూర్తివేసి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం లేని యెడల ఇంకా ఈ పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయుచున్నాము

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేష్ శివుని నాయుడు మరియు ప్రయాణికులు పాల్గొన్నారు

సో ల్ల పదం దేవాలయం వద్ద అంతరాష్ట్ర రహదారి పైన వినూతన రీతిలో నిరసన తెలియజేస్తూ ఉన్న నాయకులు ఫోటో వీడియో నాయకులు మాట్లాడుతున్న వీడియో చూడగలరు

Akhand Bhoomi News

error: Content is protected !!