రహదారి పనులు తొందరగా పూర్తి చేసేలా చర్యలు
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 17( అఖండ భూమి న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
రహదారి విస్తరణ పనులను తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు *తోయక* *జగదీశ్వరి* అన్నారు. సోమవారం నాడు కురుపాం నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. రహదారికి ఇరువైపులా కాలువలను పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న కాలువలను పరిశీలించారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేవెంట మండల పార్టీ అధ్యక్షులు కొండయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కోలా రంజిత్ కుమార్, జె.ఈ సుశీల, ఇంచార్జ్ ఈఓపిఆర్డి వెంకట నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



