డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్)
బిక్కనూరు మండల కేంద్రంలో గల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్థానికులకు కేటాయించాలని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రస్తుత పరిస్థితిని గమనించాలని అడిషనల్ కలెక్టర్ ని మంగళవారం పంపించడం జరిగింది. మండల కేంద్రానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ అధికారులతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిశితంగా పరిశీలించడం జరిగింది ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని గమనించి ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నీటి సౌకర్యం ఎందుకు కల్పించలేకపోయారని అధికారులను ప్రశ్నించగా అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించామని కానీ ఆ నీటిని సప్లై చేసే పైప్లైన్ చెడిపోయిందని ఈ ఇళ్లకు సంబంధించి సగం పనులను కాంట్రాక్టర్ వదిలేసి వెళ్లిపోయాడని విన్నవించడం జరిగింది. మాజీ సర్పంచ్ తునికి వేను జోక్యం చేసుకుని ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తే అన్ని రకాలుగా బాగుంటుందని అదనపు కలెక్టర్కు విన్నవించడం జరిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన కొందరు నిరుపేద మహిళలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ సరియైన ప్రకారం జరగలేదని అర్హత ఉన్నవాళ్ళకి ఇవ్వలేదని నిజానిజాలను విచారణ చేస్తూ అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నిజా నిజాలు అన్ని పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి ఇళ్లను కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో వీణ డి ఎల్ పి ఓ శ్రీనివాస్ ఎంపీడీవో రాజకీయరన్ రెడ్డి కలెక్టర్ గారితో ఉన్నారు. మాజీ సర్పంచ్ తునికి వేణు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసి అర్హత ఉన్న కుటుంబాలకు ఇచ్చి ఇట్టి కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయాలని విన్నవించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



