ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు

ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు

గత నెల 27వ తేదీన చంద్రవతి కళ్యాణమండపంలో హుండీలెక్కింపు నిర్వహించబడింది.

శ్రీశైలం ఖండభూమి న్యూస్ ,22- జూన్

వదరు హుండీ లెక్కింపుకు సంబంధించి రెండు సంచులలోని మొత్తమును బ్యాంకు నందు జమ చేయకుండా దేవస్థానం క్యాషియర్ వద్ద భద్రపరచడం జరిగిందని, దీనివల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దేవస్థానానికి ఫిర్యాదు అందినది.

సదరు ఫిర్యాదుకు స్పందనగా దేవస్థానం ఉన్నతాధికారులచేత అంతర్గత విచారణ చేపట్టడం జరిగింది. సదరు విచారణలో దేవస్థానంలో క్యాషియర్గా విధులు నిర్వవహించిన జి. శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ మరియు హెచ్. నుంజునాథ్, జూనియర్ అసిస్టెంట్లు సదరు విషయములో నిర్లక్ష్యంగా వ్యహరించినట్లు నిర్ధారించడం జరిగింది.

సదరు విచారణ నివేదిక మేరకు క్రమశిక్షణా చర్యలలో భాగంగా దేవదాయ ధర్మదాయచట్టం ఆఫీస్ హోల్డర్స్ అండ్ సర్వెంట్స్ పనిష్మెంట్ రూల్స్ 1987 నందలి సెక్షన్ ప్రకారముగా వీరిరువురిని విధుల నుండి తాత్కాలికంగా నిలుపుదల (సస్పెన్షన్) చేయడమైనది.

కాగా ప్రస్తుతం  హెచ్ మంజునాథ్, జూనియర్ అసిస్టెంట్  ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా కాణిపాక దేవస్థానమునకు బదిలీ కావడం జరిగింది. ప్రస్తుతం వీరు కాణిపాక దేవస్థానములో విధులు నిర్వహిస్తున్నారు. కావున ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను కాణిపాక దేవస్థానం. కార్యనిర్వహణాధికారి వారి ద్వారా మంజునాథ్ వారికి అందజేయబడింది. సదరు సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయవలసినదిగా కూడా కాణిపాక దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారిని కూడా కోరడం జరిగింది.

తదుపరి ఇందు విషయమై వివరించునది ఏమనగా హుండీ లెక్కింపురోజున చంద్రవతి కళ్యాణమండపంలో చిల్లర నాణెములు కలిగిన ఒక సంచిని సిబ్బంది మరిచిపోయినట్లుగా విచారణలో గుర్తించడం జరిగింది. ఈ సంచిని భద్రతా సిబ్బంది క్యాషియర్ వారికి అందజేసియున్నారు. అకౌంట్ను విభాగపు అధికారులు ఈ సంచిని పరిశీలించగా, అందులో చెల్లుబాటు కాని నాణెములు అనగా 10 పైసలు, 20 పైసలు, పొవలా మరియు అర్ధరూపాయలు ఉన్నట్లుగా గమనించడం జరిగింది.

అదేవిధంగా ఆ సంచిలోనే కొన్ని రూపాయ నాణెములు మరికొన్ని రెండు రూపాయల నాణెములు ఉన్నట్లుగా అధికారులు గుర్తించియున్నారు. దాంతో సంచిలోని చిల్లర నాణెములను వేరు పరిచి, సంబంధిత మొత్తమును ప్రత్యేకంగా సంచిలో భద్రపరిచి, సదరు సంచిని తిరిగి క్యాషియర్ ద్వారా అమ్మవారి ఆలయం నందు గల హుండీలో వేయడం జరిగింది.

తదుపరి దేవస్థానం హుండీల లెక్కింపును ఎంతో పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. హుండీల లెక్కింపునంతా కూడా 360° డిగ్రీల నిడివితో సి.సి. కెమెరాల ద్వారా రికార్డు చేయబడుతుంది. హుండీల లెక్కింపు సమయంలో కూడా భద్రతా సిబ్బంది లెక్కింపు ప్రక్రియనంతా కూడా నిరంతరం కంట్రోల్ రూము నుంచి కూడా పర్యవేక్షిస్తుంటారు. అదేవిధంగా చంద్రవతి కల్యాణమండపంలో కూడా భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా హుండీల లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తుంటారు. దేవస్థానంలోని పలు విభాగాల యూనిట్ అధికారులకు, పర్యవేక్షకులకు ప్రత్యేక విధులు కేటాయించబడుతాయి. ఈ అధికారుల నిరంతర పర్యవేక్షణలోనే హుండీల లెక్కింపు జరిపించబడుతోంది. అదేవిధంగా నంద్యాల జిల్లా అసిస్టెంట్ కమీషనర్ వారి తరుపున దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ కూడా హుండీల లెక్కింపుకు హాజరవుతారు.

కావున హుండీల లెక్కింపు జవాబుదారితనంతోను మరియూ పూర్తి పారదర్శకంగా నిర్వహించబడుతుందని తెలియజేయుచున్నాము. అని శ్రీశైల దేవస్థానంశ్రీనివాసులు తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!