కోటనందూరు. జూన్ 23 (అఖండ భూమి).
కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు నెమ్మాది సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ కి ఆయన చేసిన సేవలకు గాను పార్టీ గుర్తింపు దక్కింది.ఆయనను తెలుగుదేశం పార్టీ కోటనందూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షునిగా అధిష్ఠానం నియమించింది. ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నన్ను నమ్మి నాపై పెట్టిన బాధ్యతను సగర్వంగా నిర్వహిస్తానని తెలిపారు. అంతేకాకుండా పార్టీ తనను గుర్తించినందుకు గాను మాజీ మంత్రి వర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారికి, తుని నియోజకవర్గ శాసన సభ్యులు యనమల దివ్య గారికి, కోటనందూరు మండల టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజబాబు గారికి , బుల్లి బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ANDHRA BREAKING NEWS MOVIES NEWS PAPER POLITICS STATE TELANGANA