ఎమ్మెల్యే మదన్ మోహన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం…

ఎమ్మెల్యే మదన్ మోహన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం…

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, 20 లక్షల నిధులతో నిర్మించిన బయ్యంపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయితీ భావన ప్రారంభ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.

సోమవారం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, లింగంపేట మండల ప్రజలు & రైతులు భు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో మాట్లాడి భూభారతి పైలట్ ప్రాజెక్ట్ లింగంపేట మండలం ఎంపిక చేసాం అని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నిర్మించలేదని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయం గుర్తు చేశారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల కొరకు ₹23 కోట్ల నిధులు మంజూరయ్యాయని, నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల కోసం ప్రభుత్వ అధికారులతో, మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ₹50 కోట్ల నిధులతో నూతన సిసి రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.

 

వచ్చే రోజుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు , ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!