రాజంపేట మండలంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 29 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సోమవారం రాజంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో రాజంపేట పొందుర్తి, తలమడ్ల, శివాయిపల్లి, పెద్దపల్లి, ఆరేపల్లి, ఆరేపల్లి తండా గ్రామాలను సందర్శిస్తారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఎమ్మెల్యే పర్యటన విజయవంతం కావాలని బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. సంపత్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి కుల సంఘ నాయకుడు సమన్వయం సాధించి పర్యటనను సఫలీకరించాలి, అని తెలిపారు. పాల్గొననున్న గ్రామస్థులు, నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.