అంధకారంలో దళిత విద్యార్థుల భవితవ్యం
పట్టించుకోని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులు
ఆందోళనలొ విద్యార్థులు తల్లిదండ్రులు
నల్లగొండ జిల్లా జూన్ 29 (అఖండ భూమి న్యూస్) :
రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 1వతరగతి నుండి 10వతరగతి అపైన విద్యను ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాల లొ విద్యను అందిస్తుంది, ఐతే గత మూడు నాలుగు సంవత్సరాలనుండి ఈ విద్యార్థులకు ఫీజ్ బకాయిలు విడుదల కాలేద, ఈ స్కీం పాఠశాలల యాజమాన్యం విద్యార్థులను ఫీజ్ లు చెల్లిస్తనే పాఠశాల కి రావాలని మానసికంగా ఇబ్బంది కి గురిచేస్తున్నారు, ఈ విషయం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి. మరియు సంక్షేమ శాఖ అదికారులకి తెలిజేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది, ఈనెల జూన్ 12 వ తేదిన పాఠశాలలు పునాప్రారంభం కాగా ఇప్పటి వరకు విద్యార్థులకు అందవల్సిన బుక్స్ కాని యూనిఫామ్ మరియు షూస్ అందలేదు పైగా 3సంవత్సరాల బకాయిలు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం విద్యార్థులను చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు,ఈ విషయం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మరియు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి ఈ విషయం తెలియజేసిన ఫలితం లేకుండా పోయింది రేపు పాఠశాలలకు విద్యార్థులు పోదామాంటేనే భయంతో వణికిపోతున్నారు,పొతే బైట నిలబెడుతున్నారు, ఎందుకంటే మీకు బుక్స్ లేవని మరియు ఫీజలు చెల్లిస్తనే అనుమతిస్తామని ఉపాధ్యాయులు యాజమాన్యం ఖర కండిగా చెపుతున్నారు, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు IIT, NEET, CBSE ఉచిత విద్య అందించి ప్రభుత్వం నుండి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యార్థులకు బుక్స్ మరియు నోట్ బుక్స్ స్కూలు యూనిఫామ్ మరియు షూస్ లు అందె విదంగా చూడాలని ప్రభుత్వానికి మరియు జిల్లా కలెక్టర్ కి విద్యార్థుల తల్లిండ్రులు విన్నవించుకుంటున్నారు,
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు
మామిడి జగన్ బచ్చలకూరి కార్తీక్ దామెర రవికుమార్, నాగరాజు, బండారు శంకర్ , కట్ట నవీన్, దార్ల రాజు,పులిమెల అరుణ .కంచనపల్లి నవ్య. శివ.రాజు. నరసింహ మరియు
తదితరులు పాల్గొన్నారు