ఎయిడెడ్ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ…
వెల్దుర్తి జూన్ 30 (అఖండ భూమి వెబ్ న్యూస్) : స్థానిక వెల్దుర్తి పట్టణంలోని ఎస్సీ కాలనీ కి చెందిన ఎయిడెడ్ పాఠశాలను సోమవారం ఎంఈఓ రమేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరానికి కేటాయించిన స్కూల్ యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్ వినియోగించుకోవాలని అన్నారు. గత విద్య సంవత్సరానికి చెందిన యూనిఫామ్ ను ధరించకూడదని తెలిపారు. విద్యార్థిని విద్యార్థుల హాజరు నమూనా రెగ్యులర్ గా ఆన్లైన్ చేయాలని ఉపాధ్యాయురాలుకు సూచించారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్నందువలన ఇంకో ఉపాధ్యాయురాలు కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా మిడ్ డే మీల్స్ విద్యార్థిలకు సక్రమంగా రుచికరంగా వడ్డించాలని మెనూ పాటించాలని తెలిపారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



