పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్…
-పరారీలో అతని సోదరుడు సురేందర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 6 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణంలో ఇటీవల పోలీసులు పట్టుకున్న జిలేటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. జిలేటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని సోదరుడు సురేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అయితే గడ్డం సురేందర్ రెడ్డి పరారీలో ఉండటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఓపెన్ ప్లాటులో బండరాళ్లు పేల్చేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి చెందిన శ్రీవారి ఏకో టౌన్ షిప్ నుంచి జిలేటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తీసుకువచ్చినట్టుగా సమాచారం. ఈ కేసులో ప్రభుత్వ అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తన వెంచర్ లో నిలువ చేయడంతో పాటు ఇతరులకు సరఫరా చేసిన కేసులో చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించినట్టుగా సమాచారం.
You may also like
-
మెదక్ ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవదయ శాఖకు ఇచ్చేదే లేదు
-
అర్ధరాత్రి వసతిగృహాల్లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
-
స్థలసేకరణ పనులు వేగవంతం చేయాలి: పి ప్రావిణ్య, జిల్లా కలెక్టర్.
-
అందోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు
-
మంత్రి నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి