పేలుడు పదార్థాల విలువ కేసులో నా భర్త చంద్రశేఖరకు ఎలాంటి సంబంధం లేదు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి! జూలై 6 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పేలుడు పదార్థాలు నిల్వ కేసులో తన భర్త రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని అర్ధరాత్రి 12 గంటలకు అరెస్టు చేసి జైలుకు తరలించాలని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశం సందర్భంగా మాట్లాడుతూ. మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారని అన్నారు. శ్రీవారి వెంచర్ ను విబూస్ వెంచర్స్ వారికి అప్ప చెప్పామని అన్నారు. మా భర్త చంద్రశేఖర్ రెడ్డి పై గుంట భూమి కూడా లేదని ఆమె ఆరోపించారు. రాజకీయ ఎదుగుదలకు ఓర్వలేకనే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్ష కారణంగా తమపై ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మా భర్త ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కృషి చేస్తున్నామన్నారు. పేలుడు పదార్థాలు నిర్వహిస్తున్న భర్త చంద్రశేఖర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు అన్నారు. మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లు అండగా ఉన్నారని పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలుపు కోసం తమవంతు కృషి చేశామన్నారు. దాని ఫలితంగానే టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కి పదవి కట్టబెట్టాలని ఆమె అన్నారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మరింత పరిశ్రమ చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ ఉరుదొండ వనిత రవి, మాజీ కౌన్సిలర్లు శివ కృష్ణమూర్తి, కంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, వంశీ, పిడుగు మమత, సాయిబాబా, సుగుణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
-
మెదక్ ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవదయ శాఖకు ఇచ్చేదే లేదు
-
అర్ధరాత్రి వసతిగృహాల్లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
-
స్థలసేకరణ పనులు వేగవంతం చేయాలి: పి ప్రావిణ్య, జిల్లా కలెక్టర్.
-
అందోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు
-
మంత్రి నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి