అల్లిపూడి లో ఘనంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0.

అల్లిపూడి లో ఘనంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0.

కోటనందూరు మండలం.(అఖండ భూమి). తుని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు అల్లిపూడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యారంగాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. తొలుత ఈ కార్యక్రమాన్ని మండల టిడిపి నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 తో విద్యార్థులు భవిష్యత్తు తేజోమయమవుతుందని అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో విద్యాభివృద్ధికి ఈ కార్యక్రమం మూల స్తంభంగా నిలుస్తుందని న్యాయవాది కళ్యాణ్ అన్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యకు ధీటుగా ప్రభుత్వ స్కూల్ విద్యను అభివృద్ధి పరచడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ చైర్మన్ మారే సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వర్తింపజేయటం, సన్న బియ్యం అందించడం గొప్ప విషయమని అన్నారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిపై ఉపాధ్యాయుల నుంచి సమాచారం పొందారు. మౌలిక సదుపాయాలును గూర్చి చర్చించారు. ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణం తో ఘనంగా నిర్వహించారు. పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తరిపే నూకలమ్మ, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంకంరెడ్డి గోపి, చింతకాయల కొండబాబు, చిటికెల సత్తిబాబు, చింతకాయల సురేష్ కుమార్, చిట్టుమురి జమీలు, నెమ్మది సత్యనారాయణ, దుత్తర్తి మరిణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!