గునుపూడి లో ఘనంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0.
నాతవరం మండలం గునుపూడి ఎం.పీ.పీ స్కూల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యారంగాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ్రు రవణమ్మ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం మరియు తల్లికి వందనం కుటుంబంలోని చదువుకునే అందరి పిల్లలకు వర్తింపచేయటం,సన్న బియ్యం అందించడం లాంటి కార్యక్రమాలు విద్యార్థుల కొరకు ప్రభుత్వం చేపట్టడం చరిత్రలో నిలిచిపోయే విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది నాగేశ్వరరావు, కొండ్రు రవణమ్మ, చిట్టిమూరి గంగరాజు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.