నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తాం…
బహుజన సమాజ్వాది రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్)
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో బీఎస్పీ పార్టీ పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు బహుజన సమాజ్వాది రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరు జరిగింది. రాష్ట్ర ఈసీ మెంబర్ అడ్వకేట్ నీరడీ ఈశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. బహేంజీ మాయావతి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో అన్ని అసెంబ్లీలు పూర్తిస్థాయిలో కమిటీలు వేయాలని అన్నారు. ప్రతి నాయకుడు ఒక నెలలో 15 నుంచి 20 రోజులు ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది, రాబోయే ప్రాంతీయ , స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.బీసీ ఎస్సీ,ఎస్టీ మత మైనార్టీ అగ్రవర్ణాలాలో పేదలకు అందరికీ సమానమైన న్యాయం , రాజకీయరంగంలో జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లను అన్ని కులాలకు సమానంగా ఇవ్వగలిగే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ తో మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు.భారత రాజ్యాంగమే మేనిఫెస్టో కలిగిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయగలిగే పార్టీ బహుజన సమాజ్ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామకృష్ణ గారు కామారెడ్డి జిల్లా ఇన్చార్జిగా కొక్కొండ రాజేందర్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ ఈసిరికాయల సాయిలు మరియు లింగం గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు నత్తి జీవన్ మరియు ఉపాధ్యక్షులు దుబ్బక నవీన్ గారిని నియమించడం జరిగింది.ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్, ఆధ్వర్యంలో జరిగింది, ఈ సమావేశంలో జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు ఈభత్వార్ రోహిదాస్, ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మర్లు సాయిబాబు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బజార్ ప్రభాకర్ దాస్, కామారెడ్డి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి గుండెల్ని ప్రవీణ్, బాన్సువాడ అసెంబ్లీ కార్యదర్శి విద్యాసాగర్, రుద్రూర్ మండల అధ్యక్షులు గౌతం కాంప్లె తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…