విద్యారంగంలో పెరిక కులస్తులు ముందుండాలి.

విద్యారంగంలో పెరిక కులస్తులు ముందుండాలి.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్)

విద్యారంగంలో పెరిక కులస్తులు ముందుండాలని జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడు కుంచాల శేఖర్. దోమకొండ సదరు సంఘం అధ్యక్షుడు మర్రి శేఖర్ . ప్రధాన కార్యదర్శి బోడ కుంటి తిరుపతి లు అన్నారు. దోమకొండ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది పదవ తరగతి. ఇంటర్మీడియట్. ఎంబిబిఎస్. డిగ్రీ లలో ఉన్నత మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని విద్యార్థుల కు పెరిక సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ప్రోత్సాహ బహుమతులు సైతం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిక కులస్తులు విద్యారంగంలో ముందుండాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు తల్లిదండ్రులు అందించాలని. రాబోయే రోజుల్లో పెరిక కులస్తుల విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన కోచింగ్లను సైతం ఇచ్చేందుకు సంఘం ముందుండాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థను ఎంచుకొని ప్రతి విద్యార్థి ముందుండాలన్నారు. రానున్న కాలం సైతం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలతో పాటు. వారి తల్లిదండ్రులు సైతం అందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏదైనా అవసరమైతే కుల సంఘ సభ్యులకు సంఘంలో ఉన్న ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగుతున్న వారిని సంప్రదించవచ్చని వారు సూచించారు. వీటితోపాటు సంఘ సభ్యులు రాజకీయాల్లో సైతం తమ సత్తా చాటాలని సూచించారు. విద్యతోపాటు ఉపాధి అవకాశాలపై సైతం దృష్టిసాదించాలని వారు సూచించారు.ఉన్నత మార్కులు తెచ్చుకున్న 11 మందికి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాండీ అధ్యక్షులు అంకత్ నరసింహులు కుంచాల సత్యం ఆశంశెట్టి పోచయ్య.. అల్లే రవి. శంకర్. నల్లపు శ్రీనివాస్. కానీ ఏంటి నాగరాజ్. పిన్నం రామచంద్రం. అబ్బయ్య. బురి రవి. బురిలింగం. గోపాల్. పూజారి రాజు. జనార్ధన్. బోడ కుంటి రవి. గోల్డ్ ప్రభాకర్. రాజు. మర్రి సిద్ధ రాములు. కానుగంటి శంకర్. బాబు. దేవరగట్టు రాజు. కానుగంటి రాజు. బుర్రి రాజేందర్. తో పాటు కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!