బాగిర్తి పల్లి లో ముత్యాలమ్మ పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తి పల్లి లో ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ హరీష్ షబ్బీర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఆదివారం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి అర్చన, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులను కలిసి ప్రజా పాలన పై మహిళలను వివరాలాడికి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.